దుబాయ్‌‌లో కంచర్ల యువకుడు సూసైడ్.. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

దుబాయ్‌‌లో కంచర్ల యువకుడు సూసైడ్.. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్

వీర్నపల్లి, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్​ వెళ్లిన ఓ యువకుడు అక్కడ సూసైడ్  చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన వరికుప్పల రాకేశ్(22) ఉపాధి కోసం దుబాయ్‌‌  వెళ్లాడు. అక్కడ ఆశించిన జీతం రాకపోవడం, మరోవైపు సొంత ఊళ్లో చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఉండడంతో తీవ్ర మనస్తాపానికి గురై తాను ఉండే రూమ్​ బిల్డింగ్​పై శనివారం రాత్రి ఉరేసుకున్నాడు. 

తండ్రి చిన్నతనంలోనే చనిపోగా, తల్లి కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడనుకున్న కొడుకు చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. రాకేశ్​ డెడ్​బాడీని తెప్పించాలని ఎమ్మెల్యే కేటీఆర్ కు సర్పంచ్  సామల్ల దేవరాజ్, వడ్డెర సంఘం ప్రెసిడెంట్  గోగుల రమేశ్​ ఫోన్​ చేసి విన్నవించారు. స్పందించిన కేటీఆర్  డెడ్​బాడీని తెప్పించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.